- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రార్థనల వెనక ఆంతర్యం ఏమిటి?
దిశ, కరీంనగర్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన ప్రార్థనల వెనక ఆంతర్యం ఏంటి? ఆ ప్రార్థనలకు హాజరైన తర్వాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు పెరిగాయి? ప్రార్థనాస్థలంలో జనం గుమికూడినందున ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం యాదృచ్ఛికమేనా? లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? ఢిల్లీలోని ఒక్క మసీదు నుంచి మొత్తం దేశానికి కరోనా వైరస్ వ్యాపించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే దేవ్‌బంద్, అజ్మీర్ లాంటివి కూడా తెరపైకి వచ్చాయి. ఇవి కూడా యాదృచ్ఛికంగా జరిగినవేనా లేక మర్కజ్‌కు కొనసాగింపుగా చోటుచేసుకున్నవా? ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ అంశాలపై లోతుగా ఆరా తీస్తోంది. అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమగ్ర వివరాలు, వీలైతే ఆధారాలను సేకరించి నివేదికలు పంపాల్సిందిగా కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.
మత ప్రచారంలో భాగంగా ఇండోనేషియా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారిలో చాలామంది కరోనా బారిన పడ్డారు. మతప్రచారం కోసమే వచ్చారా లేక వైరస్‌ను అంటించే పని పెట్టుకున్నారా అనే కామెంట్లు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. జాతీయ మీడియాలో సైతం చర్చోపచర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేసే విధంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న క్రమంలో మతం రంగు అంటించవద్దంటూ స్పష్టం చేసింది. ఐబీ వర్గాలు మాత్రం క్షేత్రస్థాయిలో ఈ విషయంపై ఆరా తీస్తున్నాయి. ప్రార్థనలు జరిగిన ప్రాంతాలతో పాటు ఆయా చోట్ల జరిగిన ప్రార్థనలకు హాజరైనవారి వివరాలు సేకరిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సైతం కరీంనగర్ సంఘటన తర్వాత రాష్ట్రమే కేంద్రాన్ని అలర్ట్ చేసిందని గర్వంగా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని, మర్కజ్ వ్యవహారంలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం కంటే చాలా ఎక్కువే సేకరించారని కితాబునిచ్చారు.
తొలుత విదేశీ ప్రయాణికుల నుంచి వైరస్ రావడంతో కట్టడి చర్యలు తీసుకున్న తర్వాత తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో మర్కజ్ వ్యవహారంతో మరింత వ్యాప్తి చెందడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నవారికి స్థానికులు ఎవరైనా మద్దతు తెలిపారా అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరిస్తున్నాయి. మత ప్రచారం కోసం వీరు ఎంచుకున్న కీలక కేంద్రాలు ఏవి? ఇప్పటివరకు ఎన్నిచోట్ల ఈ ప్రార్థనలు ముగిశాయి? రానున్నకాలంలో ఇంకా ఏఏ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది తదితర వివరాలపై కూపీ కూడా లాగుతున్నారు. రాష్ట్ర నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకున్న ఐబీ వర్గాలు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా యూపీ ప్రార్థనల విషయం కూడా వెలుగులోకి రాకవడంతో రెండు చోట్ల ప్రార్థనలకు పంపించేందుకు కారకులు ఎవరు? కేవలం మసీదు కమిటీల పాత్రే ఉందా వేరే సంస్థల హస్తం ఉందా అన్న కోణంలోనూ ఆరా తీస్తోంది ఐబి.
Tags: Telangana, Markaz, Indonesia, Central Intelligence, IB, Karimnagar