- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
దిశ, భద్రాచలం : తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. డీఆర్‌జి జవాన్లకి, మావోయిస్టులకు మధ్య నీలవాయి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. నక్సలైట్ మృతదేహం, ఆ ప్రాంతంలో 9 ఎంఎం పిస్టల్, దేశీయ ఆయుధం 3 కిలోల ఐఈడీ, నక్సల్స్ వాడే సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుడు నీలవాయి గ్రామానికి చెందిన కోసాగా గుర్తించారు. అతనిపై ఛత్తీస్‌గఢ్‌లో రూ.5 లక్షల రివార్డు ఉంది. ఈ ఘటనని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.
ముప్పేట దాడి.. తప్పించుకున్న నక్సల్స్
మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొండగావ్, నారాయణపూర్, కాంకర్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్మెటా గ్రామ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది. హోరాహోరీగా జరిగిన కాల్పుల అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అంతర్‌గఢ్ ఎస్‌డిఓపి కౌశలేంద్ర పటేల్ తెలిపారు.