- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళితుల నుంచి తిరిగి లాక్కున్నారు : మందకృష్ణ
దిశ, సూర్యాపేట: సీఎం కేసీఆర్ తీసుకుంటున్న దుర్మార్గపు నిర్ణయాల మూలంగా దళిత, గిరిజనులు సమాజంలో నిలువనీడ లేకుండా పోయి ప్రమాదంలో ఉన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట దళితుల భూముల పరిరక్షణ కోసం గత మూడ్రోజులుగా నిర్వహిస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ…
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో ప్రమాదంలో పడితే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయాలతో దళిత, బడుగు, బలహీనవర్గాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులకు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం మాత్రం వాటిని తిరిగి లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం, పంపిణీ చేయకపోగా ఈ ఆరేండ్లలో దళితుల నుంచి లక్ష ఎకరాలకు పైగా భూమి లాక్కుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో సర్వే నంబర్ 349లో గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక నిర్మాణం పేరుతో లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.