- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్వపడేలా నిర్మించుకుందాం : మందకృష్ణ
దిశ, సిద్దిపేట: వికలాంగులపై సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నాడని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా వికలాంగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వికలాంగులకు పెన్షన్ ఇస్తూనే కొన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారి ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కూనీ చేశారని విమర్శించారు.
వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసి దాన్ని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కలిపారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారి హక్కులను నెరవేర్చడానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడిందన్నారు. వాళ్లకు దేశంలో వందలాది సంఘాలు ఉన్నాయని, కానీ వికలాంగుల హక్కుల పోరాట సమితి వచ్చాక సమాజంలో వికలాంగులకు వెలుగు వచ్చిందన్నారు. వికలాంగుల పెన్షన్ కోసం 2007 లో పోరాటం చేయకముందు పెన్షన్ రూ.200 ఉండేదని, పోరాటాల ఫలితంగానే నేడు రూ.3 వేలు వస్తున్నాయన్నారు.
ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లే వికలాంగులకు పెన్షన్ పెరిగిందన్నారు. వాళ్లు కూడా రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ యుద్ధంలో ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలవాలన్నారు. 2023 తర్వాత వికలాంగుల సంక్షేమ శాఖ మరింత శక్తిగా పునరుద్ధరణ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వికలాంగుల నూతన భవనాన్ని హైదరాబాద్‌లో అందరు గర్వపడేలా నిర్మించుకుందామని అన్నారు.