మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తాం : మంచు విష్ణు

by Shyam |
Manchu Vishnu
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా.. ఈ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కాసేపట్లో ప్రకటించనున్నట్టు మంచు విష్ణు తెలిపారు. అంతేగాకుండా.. తాము గెలిస్తే మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామని మంచు విష్ణు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు మేనిఫెస్టో ఊసెత్తని ప్రకాశ్ రాజ్ ప్యానెల్, ‘మా’కు బిల్డింగ్ ఒక్కటే సమస్య కాదని, అనేక సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story