దర్శనం కోసం మేడారం వచ్చి.. అనంతలోకాలకు

by Shyam |
దర్శనం కోసం మేడారం వచ్చి.. అనంతలోకాలకు
X

దిశ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క వనదేవతల దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు సుదర్శన్ రెడ్డి(50) జంపన్న వాగులో స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు ఘట్కేసర్ శివారెడ్డి గూడ‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి దైవ దర్శనం కోసం మేడారం వచ్చినట్టు తాడ్వాయి ఎస్సై రవీందర్ తెలిపారు.

Advertisement

Next Story