- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్… సంజూ శాంసన్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన 9వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ లెవన్ పంజాబ్ నిర్ధేశించిన భారీ 223 పరుగుల లక్ష్యాన్ని చేధించి భళా అనిపించింది. ఈ మ్యాచ్‌లో యువ భారత ఆటగాడు సంజూ శాంసన్ విరోచిత పోరాటం చేశాడు. భారీ షాట్లతో సిక్సర్ల మోత కురిపించాడు. 85 పరుగుల వ్యక్తిగత పరుగులు చేసి (42 బంతుల్లో 85, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రాజస్థాన్ గెలుపులో కీలకంగా మారాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
Next Story