దారుణం.. కూరగాయల కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తిరిగిరాని లోకాలకు

by Sumithra |
died
X

దిశ, అశ్వారావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృత్యువాత పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై చల్లా అరుణ తెలిపిన వివరాల.. ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాసం లక్ష్మణరావు (45) నారంవారిగూడెం గ్రామంలోని ఓ భూస్వామి దగ్గర గుమస్తాగా రెండు సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కూరగాయలు తీసుకువచ్చేందుకు అశ్వారావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్ వద్ద జెసీబీ వాహనం వెనక నుంచి డీ కొనడంతో సత్తుపల్లి వైపుగా వెళ్తున్న లారీ కింద పడ్డాడు. దీంతో వాసం లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి కొడుకు వాసం ముత్యాలు తెలిపాడు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed