కోడలు కాపురానికి రావడం లేదని మామ ఆత్మహత్య

by Sumithra |
కోడలు కాపురానికి రావడం లేదని మామ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కోడలు కాపురానికి రావడం లేదని ఓ మామా తనువు చాలించాడు. కొడుకుతో గొడవ పడి పుట్టింటికి వెళ్లడమే కాకుండా.. అత్తారింటికి ఇక రానని చెప్పడం, బంధువుల మధ్య జరిగిన గొడవలకు తీవ్ర మనస్థాపం చెందిన ఆయన చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోనే నివాసం ఉంటున్న నోముల వెంకటేశ్(55) ఇంట్లో గత కొద్ది రోజులుగా గొడవలు జరుతున్నాయి. కన్న కొడుకు పెండ్లి చేసిన భార్యభర్తల మధ్య గొడవలతో వారిద్దరు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కోడలు పుట్టింటి వద్దనే ఉంటుంది. ఇదే వ్యవహారం పెద్దరికం వహించిన నోముల వెంకటేశ్ కోడలిని అత్తారింటికి రావాల్సిందిగా కోరాడు. అయితే, తన కొడుకు ప్రవర్తన నచ్చలేదని ఆమె తెగేసి చెప్పడం, ఇదే సమయంలో కోడలి తరఫు బంధువులు వచ్చి నోముల వెంకటేశ్ ఇంటి వద్ద గొడవకు దిగారు. దీంతో తీవ్ర అవమానం జరిగిందని భావించిన ఆయన సమీపంలోని సద్దుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Next Story