- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్య అలా చేసింది.. వారిని వదిలి ఉండలేని భర్త చెట్టు ఎక్కి..

X
దిశ, మంగపేట: ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. బిడ్డలు దూరమవుతున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే.. మంగపేట మండలం కమలాపూర్ లోని ఎస్సీ కాలనీలో పున్నారావు అనే వ్యక్తి భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పున్నారావుకు, భార్యకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పిల్లలకు దూరమవుతున్నాననే మనస్తాపంతో పున్నారావు గురువారం ఉదయం గ్రామంలోని చెట్టు ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story