- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతను చనిపోతూ… లేఖ ఇలా రాశాడు
దిశ, నర్సంపేట : సొంతంగా కొనుగోలు చేసుకుని నడుపుతున్న జీపును మాజీ యజమాని బలవంతంగా లాక్కెళ్లడంతో అవమానంగా భావించిన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ముత్తోజిపేట గ్రామానికి చెందిన పోశాల గణేష్ నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్ అనే వ్యక్తి దగ్గర కార్ డ్రైవర్ గా గతంలో పని చేసేవాడు. ఆ సమయంలో యజమాని సురేష్ అడ్వాన్స్ గా రూ. ముప్పైవేలు ఇచ్చాడు. అనంతరం సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని భావించిన గణేష్ సొంతంగా ఓ జీపు కొనుక్కుని నడుపు కుంటున్నాడు.ఇదిలా ఉండగా గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సురేష్ కొద్ది రోజులుగా గణేష్ ని ఇబ్బందుల పాలు చేశాడు. అతని జీవనాధారమైన జీపుని బలవంతంగా లాక్కెళ్లాడు. అప్పటికే ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న గణేష్ ఈ పరిణామంతో ఆవేదన చెందాడు. నాలుగు రోజుల కిందట పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న క్రమంలో ఆరోగ్యం విషమించి మంగళవారం మృతి చెందాడు. అతడు చికిత్స పొందుతున్న సమయంలో తన చావుకు యజమాని వేధింపులే కారణమని లేఖ రాశాడు. గణేష్ మృతితో ముత్తోజిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.