భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. ఇంటికెళ్లి కిటికిలోంచి చూసి షాకైన భార్య

by Sumithra |   ( Updated:2021-12-18 03:14:42.0  )
Phone-call1
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఆర్థిక ఇబ్బందుల‌తో ఓ వ్యక్తి ఆత్మహ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఎల్బీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌హారాష్ట్ర నాందేడ్ జిల్లా వ‌జీరాబాద్‌కు చెందిన పురుషోత్తం సింగ్ (26) ఎల్బీన‌గ‌ర్ మ‌న్సూరాబాద్ విజ‌య్‌న‌గ‌ర్ కాల‌నీలో భార్య కోమ‌ల్‌జిత్ కౌర్‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఏడాది క్రితం వివాహం కాగా కుష్‌ప్రీత్‌సింగ్ అనే 6 నెల‌ల బాబు ఉన్నాడు. భార్య భ‌ర్తలిద్దరూ ఆటోన‌గ‌ర్‌లోని మ‌ల్టీఫార్మాలో ప‌ని చేస్తున్నారు. కొంత కాలంగా వీరి కుమారుడు నిమోనియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. ఇప్పటి వ‌ర‌కు వైద్యం కోసం చాలా డ‌బ్బు ఖ‌ర్చు చేశారు. అయితే శుక్రవారం ఉద‌యం 10 గంట‌ల‌కు భార్యను ఆటోన‌గ‌ర్‌లో ప‌ని వ‌ద్ద వ‌దిలి ఇప్పుడే వ‌స్తాన‌ని చెప్పి వెళ్లాడు. ఎంత‌కీ తిరిగి రాక‌పోవ‌డంతో కోమ‌ల్‌జిత్ కౌర్ భ‌ర్తకు ఫోన్ చేసింది. అయినా స్పందించ‌క‌పోవ‌డంతో మ‌ధ్యాహ్నం ఇంటికి వెళ్లి చూసింది. ఇంటి త‌లుపులు ఎంత‌కీ తెర‌వ‌క‌పోవంతో ఇంటి య‌జమాని స‌హాయంతో కిటికి త‌లుపులు తొల‌గించి ఇంట్లోకి వెళ్లి చూడ‌గా పురుషోత్తం సింగ్ త‌ల‌పాగాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో ఘ‌ట‌నా స్థలానికి చేర‌కుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story