ప్రేమించ‌లేద‌ని యువతిపై క‌త్తితో దాడి

by Sumithra |   ( Updated:2020-10-30 01:24:49.0  )
ప్రేమించ‌లేద‌ని యువతిపై క‌త్తితో దాడి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండ‌లం స‌త్య‌నారాయ‌ణ‌పురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌నే కోపంతో ఓ యువకుడు ప్రియురాలిపై క‌త్తితో దాడి చేసి ముళ్ల‌పొద‌ల్లోకి నెట్టేశాడు. అక్క‌డి నుంచి పారిపోతూ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే.. స‌త్య‌నారాయ‌ణ‌పురం గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన జక్కుల సందీప్ కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే స‌ద‌రు యువ‌తి యువ‌కుడి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. దీంతో యువ‌తిపై ప‌గ పెంచుకున్న సందీప్ గురువారం అర్ధ‌రాత్రి ఆమె ఇంటికి చేరుకుని మాట్లాడుతున్న స‌మ‌యంలోనే వెంట తెచ్చుకున్న క‌త్తితో దాడి చేశాడు. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న ముళ్ల‌పొద‌ల్లో తోసేసి వెళ్లితుండ‌గా స‌మీపంలో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు తార‌స‌ప‌డ్డాడు. యువ‌కుడి చేతుల‌కు ఉన్న ర‌క్తాన్ని గ‌మ‌నించి అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం చెప్పాడు. ఘటనాస్థలికి చేరుకున్న యువ‌తిని ఖ‌మ్మం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

Next Story