‘పుష్ప’ సాంగ్, ఫైట్స్ లీక్.. చేసింది వారే!

by Shyam |   ( Updated:2021-08-16 04:41:49.0  )
‘పుష్ప’ సాంగ్, ఫైట్స్ లీక్.. చేసింది వారే!
X

దిశ, సినిమా: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్‌ విలన్‌ కాగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ కొందరు మాత్రం ఈ అంచనాలను తగ్గిస్తూ, ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు దాక్కో దాక్కో మేక సాంగ్ విజువల్స్‌కు సంబంధించిన వీడియోలు లీక్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది నిర్మాణ సంస్థ.

‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’ సినిమాలకు సంబంధించిన ఫిల్మ్ మెటీరియల్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో డీప్‌గా డిస్టర్బ్ అయ్యామన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక ఇలాంటి శాడిస్టులకు కచ్చితంగా శిక్ష పడాలని, పైరసీని ఎంకరేజ్ చేయకూడదని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story