- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎమ్మెల్యేను.. నాకే రూల్సా
దిశ, కుత్బుల్లాపూర్ : ‘మాకు కూడా రూల్స్ వర్తిస్తాయా? నా పేరు చెప్పినా మావాళ్లను వదిలిపెట్టరా’ అంటూ ట్రాఫిక్ పోలీసులపై ఎమ్మెల్యే మైనంపల్లి గుస్సా అయ్యారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లిలో సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దూలపల్లి నుంచి కొంపల్లి వైపు స్విప్ట్ డిజైర్ వాహనాన్ని ఒక యువకుడు రాంగ్ రూట్‌లో తీసుకెళ్తున్నాడు. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారును అడ్డుకొని అలా వెళ్లొద్దని సూచించారు. దాంతో ఆ యువకుడు తాను ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరుడినని చెప్పాడు.
‘మీరే ఇలా చేస్తే ఎలా? మీ వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది’ అని పోలీసులు అతనికి సూచించారు. దీంతో ఆగ్రహం చెందిన అతను వెంటనే ఎమ్మెల్యే మైనంపల్లికి ఫోన్ చేశాడు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే తన పేరు చెప్పినా తన అనుచరుడిని వదిలి పెట్టరా? అని ఆగ్రహంతో ఊగిపోతూ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీనిని వీడియో తీస్తున్న పోలీస్ ఫోన్‌ను లాక్కొని కింద కొట్టాడు. ఆ తర్వాత ఆ ఫోను వారే తీసుకొని వెళ్లారు. ఈ ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణయ్య పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..