- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్‌తో సినిమా అనగానే మా అమ్మ ఏడ్చింది : మహీరా
దిశ, సినిమా: పాకిస్థానీ హీరోయిన్ మహీరా ఖాన్ ‘రాయిస్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే కింగ్ ఖాన్ షారుఖ్‌తో కలిసి నటించే చాన్స్ కొట్టేసిన భామ.. పాకిస్థాన్ పిక్చర్ ‘హమ్ సఫర్’ ప్రమోషన్స్ కోసం ముంబైకి వచ్చిన టైమ్‌లోనే ఈ ఆఫర్ వచ్చినట్లు చెప్పింది. అయితే ఈ ఆఫర్ గురించి ఇంట్లో చెప్తే ఫన్నీ రియాక్షన్స్ వచ్చాయని వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భామ.. షారుఖ్‌తో మూవీ కన్‌ఫర్మ్ అయ్యాక ఒక రోజు రాత్రి అమ్మానాన్న, బ్రదర్‌తో మాట్లాడుతూ ఇండియన్ మూవీస్ చేయాలనుకుంటున్నానని చెప్పినా.. ఎవరు కూడా ఈ విషయాన్ని కేర్ చేయలేదని.. ‘ఇంకా ఏమైనా ఉంటే చెప్పు..’ లాంటి రియాక్షన్స్ వచ్చాయని తెలిపింది. వెంటనే ‘షారుఖ్‌తో సినిమా అయితే ఎలా ఉంటుంది?’ అనగానే అమ్మ ఆనందంతో ఏడుస్తూనే ‘నిజమా.. షారుఖ్‌తో కలిసి పని చేయబోతున్నావా?’ అంటూ తనను పొగుడుతూ.. లైఫ్‌లోనే ఇది గొప్ప విషయమని, గర్వంగా ఫీలైందని తెలిపింది.