- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డైరెక్టర్ సుభాష్.. నా కెరియర్ నాశనం చేశాడు : మహిమ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం గురించి రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకు ముందెన్నడూ నెపోటిజం గురించి మాట్లాడని నటీనటులు సైతం ఇప్పుడు దీని గురించి నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఔట్‌సైడర్ అయితే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో చెబుతున్నారు. తాజాగా హీరోయిన్ మహిమా చౌదరి తనకు జరిగిన అన్యాయాన్ని లోకానికి చెప్పింది.
1997లో ‘పరదేశి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహిమా చౌదరికి తొలి సినిమాతోనే షారుఖ్ ఖాన్‌తో జోడీకట్టే అవకాశం లభించింది. దీంతో అందరూ తనకు ఇండస్ట్రీలో ఢోకా లేదనుకున్నారు. అయితే ఈ సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుభాష్ ఘై.. తన పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడని చెప్పింది. తనను కోర్టుకు తీసుకెళ్లి ఫస్ట్ షో క్యాన్సిల్ చేయించాడన్న మహిమ.. ఆ తర్వాత ట్రేడ్ గైడ్ మాగజైన్‌లో ‘మహిమతో వర్క్ చేయాలంటే తన అనుమతి పొందాలని’ సుభాష్ ఓ యాడ్ కూడా ఇచ్చాడని చెప్పింది. ఈ పరిణామాలతో చాలా స్ట్రెస్‌కు గురయ్యానని తెలిపిన మహిమ.. ఆ టైమ్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, డేవిడ్ ధావన్, రాజ్ కుమార్ సంతోషి తనకు సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఈ నలుగురు తప్ప మిగిలిన వారెవరూ తనకు మద్దతివ్వలేదని చెప్పింది.
ఇక రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘సత్య’ సినిమాలో తనే ముందు హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయ్యానని.. కానీ వర్మ ఒక్క మాట కూడా చెప్పకుండా సినిమా నుంచి తనను తప్పించి ఊర్మిళను పెట్టుకున్నారని చెప్పింది. ఇలా చాలా ఆఫర్లు పోగొట్టుకున్నానని.. కెరియర్ డల్ అయిపోయేందుకు ఇది కూడా ఒక కారణమంటూ చెప్పుకొచ్చింది మహిమా చౌదరి. సత్య తన రెండో చిత్రం అయ్యేదని, కానీ తను కాకుండా ఊర్మిళతో ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టారని మీడియా ద్వారా తెలుసుకుని కామ్ అయిపోయినట్టు వెల్లడించింది.