హీరోయిన్ ఛాన్స్.. వర్జిన్ కి మాత్రమే అవకాశం.. ఫస్ట్ కిస్ కూడా

by Shyam |
హీరోయిన్ ఛాన్స్.. వర్జిన్ కి మాత్రమే అవకాశం.. ఫస్ట్ కిస్ కూడా
X

దిశ, సినిమా : బాలీవుడ్ 90s బ్యూటీ మహిమా చౌదరి.. హిందీ ఇండస్ర్టీలో జెండర్ ఈక్వాలిటీపై కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఫిల్మ్ మేకర్స్ ఉమెన్ ఆర్టిస్టుల కోసం బెట్టర్ రోల్స్ రాస్తున్నారని, ఎండోర్స్‌మెంట్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని చెప్పింది. అలాగే ఫిమేల్ ఆర్టిస్ట్ లైఫ్ స్పాన్ పెరగడం కూడా సంతోషాన్నిస్తుందన్న ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. ‘అప్పట్లో యాక్ట్రెస్‌ను ట్రీట్ చేసే విధానం పర్సనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపేది. జనాల్లో హీరోయిన్ వర్జిన్ అయి ఉండాలనే మెంటాలిటీ ఉండేది. ఎవరితోనైనా డేటింగ్ స్టార్ట్ చేస్తే సెన్సేషనల్ న్యూస్ అయిపోయేది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరితోనూ కిస్ చేసి ఉండకూడదనే కోరుకునేవారు. హీరోయిన్ ఎవరితోనైనా కనిపిస్తే ఓహ్.. తను డేటింగ్ చేస్తుందని రూమర్స్ క్రియేట్ చేసిన వారే పెళ్లి తర్వాత మరిచిపోతారు. అప్పటికే హీరోయిన్ కెరియర్ ఎండ్ అయిపోతుంది’ అంటూ వివరించింది. ఇక పిల్లలు పుడితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదన్న బ్యూటీ.. లియాండర్ పేస్‌తో మూడేళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత తను చీటింగ్ చేస్తున్నాడనే కారణంతో విడిపోయినట్లు టాక్.

Advertisement

Next Story