ప్రిన్స్ గ్రీన్ ఇండియా చాలెంజ్

by Jakkula Samataha |
ప్రిన్స్ గ్రీన్ ఇండియా చాలెంజ్
X

ప్రిన్స్ మహేశ్ బాబు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ‘హరా హై తో భరా హై’ చాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్.. పుట్టినరోజును ఇంత కన్నా గొప్పగా జరుపుకునే మార్గం లేదన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇళయ దళపతి విజయ్, హీరోయిన్ శృతి హాసన్‌ను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసిన మహేశ్.. ఈ చైన్ ఇలాగే కొనసాగుతూ సరిహద్దులు దాటాలని కోరారు. ఇంత గొప్ప కార్యక్రమానికి అభిమానుల సపోర్ట్ కావాలన్న సూపర్ హీరో.. మొక్కలు నాటి పచ్చటి ప్రపంచం వైపు అడుగులేద్దామని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు థాంక్స్ చెప్పారు మహేశ్.

https://www.instagram.com/p/CDqYv9CncFQ/?igshid=1r4jzlg0kt5k0

కాగా, సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా #HBDMaheshbabu హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇప్పటికే 35 మిలియన్ ట్వీట్స్ దాటడం విశేషం. అభిమానులు, సెలబ్రిటీలు ప్రిన్స్‌కు సూపర్ విషెస్ అందిస్తుండగా.. కూతురు సితార, తనయుడు గౌతమ్ స్పెషల్ బర్త్ డే విష్ చేశారు.

https://www.instagram.com/p/CDqfE8yJR0A/?igshid=6q29j9aalpli

సూపర్ స్టార్ పర్సనల్ స్టాఫ్ కూడా స్వీట్ సర్‌ప్రైజ్ విషెస్ అందించారు.

https://www.instagram.com/tv/CDqk-E9D1Ln/?igshid=1slr0plts8o8f

Advertisement

Next Story