F3 : రవితేజ ఔట్.. మహేష్ ఇన్..

by Shyam |
F3 : రవితేజ ఔట్.. మహేష్ ఇన్..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సమయంలో మహేష్, అనిల్ మంచి స్నేహితులయ్యారు. పైగా మహేష్‌ బాబుకు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, టేకింగ్ నచ్చింది. దీంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మహేష్. గతేడాది వెంకీ, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన F2 సినిమా సూపర్‌హిట్ కావడంతో సీక్వెల్ F3 కి ఓకే చెప్పేశాడట. దీంతో వెంకీ, మహేష్, వరుణ్‌లు కలిసి F3లో ట్రిపుల్ ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అయితే మహేష్‌బాబు పాత్రకు సంబంధించి ముందుగా మాస్ మహారాజ రవితేజను ఎంచుకున్నా కొన్ని కారణాల వల్ల మహేష్‌ను సంప్రదించారు దర్శక, నిర్మాతలు.

సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వస్తుందని తెలుస్తోంది. 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర కోసం మహేష్ బాబు 30 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొననున్నారట. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాడని సమాచారం. ఇందుకోసం మహేష్ ఒక్క రోజుకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.

మొత్తానికి సినీరంగం హిట్‌లు ఉన్నవారికి పెద్దపీట వేస్తుందని, ఫ్లాప్‌లో ఉన్నవారిని కన్నెత్తి చూసేందుకైనా ఆలోచిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణలా కనిపిస్తుంది కదా. రవితేజ డిజాస్టర్స్ చవి చూస్తుండడంతో పక్కన పెట్టేసి సక్సెస్ స్వింగ్‌లో ఉన్న మహేష్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు దర్శక, నిర్మాతలు.

Advertisement

Next Story