ఎమ్మెల్సీలుగా మహేందర్ రెడ్డి, సుంకరి రాజు ఏకగ్రీవం

by Sridhar Babu |
RR-MLC1
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో చంద్రశేఖర్ అనే వ్యక్తి నామినేషన్ తిరస్కరణకు గురైంది. అభ్యర్థిని బలపరిచినవారి సంతకం లేకపోవడంతో తిరస్కరించినట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియనుంది. దీంతో శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed