మళ్లీ తెరపైకి మహా-కర్ణాటక సరిహద్దు వివాదం

by Shamantha N |
మళ్లీ తెరపైకి మహా-కర్ణాటక సరిహద్దు వివాదం
X

బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉభయరాష్ట్రాల రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటకలో మరాఠీ భాష ప్రాబల్యమున్న బెలగావి, కర్వార్, నిపాణిలను మహారాష్ట్రలో కలిపేసుకుని బాల్ ఠాక్రే కలను సాకారం చేయాలని పవార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప వెంటనే ఖండించారు. మహాజన్ కమిషన్ రిపోర్టు అందరికీ తెలిసిందేనని, ఇలాంటి సమయంలో నిప్పును ఎగదోయడం సరికాదని చెప్పారు. కాగా, మరాఠీ మాట్లాడేవారికోసం ప్రత్యేకంగా సీఎం యెడియూరప్ప ప్రకటించిన పథకాలపై కాంగ్రెస్ నేత సిద్దా రామయ్య మండిపడ్డారు. కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవడి కూడా అజిత్ పవార్ తిరస్కరించారు.

Advertisement
Next Story

Most Viewed