చెరువులో మహంకాళి అస్థిపంజరం.. షాకైన గ్రామస్థులు

by Sumithra |   ( Updated:2021-07-10 01:39:37.0  )
చెరువులో మహంకాళి అస్థిపంజరం.. షాకైన గ్రామస్థులు
X

దిశ,పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూర్ చెరువులో శనివారం అస్థిపంజరం బయటపడింది. గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే సమయంలో వలకు అస్థిపజరం చిక్కడంతో మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ అస్థిపజరంకు ఉన్న చీరను బట్టి పదిరోజుల క్రితం గ్రామం నుంచి బయటకువెళ్లిన మహంకాళి సోమలక్ష్మి(56)గా వారు గుర్తించారు. దీంతో గ్రామస్థులు దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

Next Story

Most Viewed