- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతికి కరోనా అంటించేందుకు వాళ్లను పంపారు
దిశ, ఏపీ బ్యూరో: ఒకాయన ఆస్తులు కాపాడుకునేందుకు, మరొకాయన తన చిన్నాన్నను కాపాడుకునేందుకు రాష్ట్రపతిని కలిశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతికి కరోనా అంటించేందుకు చంద్రబాబు తన ఎంపీలను ఆయన వద్దకు పంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీతో నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని, అలాంటి ప్రభుత్వంపై అసత్యాలతో కూడిన తప్పుడు నివేదికను రాష్ట్రపతికి టీడీపీ నేతలు సమర్పించారని ఆయన విమర్శించారు. పోలీసు విచారణలో నేరం రుజువైతే కోర్టు అనుమతితోనే ఎవరినైనా జైల్లో పెడతారని ఆయన పేర్కొన్నారు. అచ్చెన్నాయుడుపై కేసులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న మాధవ్, గల్లా జయదేవ్ ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు