ఆంజనేయ స్వామి ఆలయ ఈవో సస్పెన్షన్

by srinivas |
ఆంజనేయ స్వామి ఆలయ ఈవో సస్పెన్షన్
X

దిశ ఏపీ బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాధ రాజు‌ పై సస్పెన్షన్ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారే ఆరోపణల నేపథ్యంలో ఈవో విశ్వనాధరాజును దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. కాగా, విశ్వనాథ రాజు వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సన్నిహితులని పేరుంది. ఈ కారణంతోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Next Story

Most Viewed