మానాడులో ముస్లిం.. ఈశ్వరన్‌లో శివుడు

by Shyam |   ( Updated:2020-11-21 02:47:24.0  )
మానాడులో ముస్లిం.. ఈశ్వరన్‌లో శివుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ శింబు హీరోగా వస్తున్న చిత్రం ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మూవీలో అబ్దుల్ ఖాలిక్‌గా ఆడియన్స్‌కు తనలోని మరో యాంగిల్ చూపించబోతున్నాడు శింబు. తల నుంచి మొహం మీదకు రక్తం కారుతుండగా, నమాజ్ చేస్తున్న ముస్లిం యువకుడిగా కనిపిస్తున్న శింబు.. అతని కనుబొమ్మల మధ్యన పాయింట్ బ్లాక్‌లో బుల్లెట్‌.. ఫస్ట్ లుక్‌‌పై ఆసక్తిని రేకెత్తిస్తుండగా సినిమా పక్కా హిట్ అంటున్నారు ఫ్యాన్స్. ఐ క్యాచింగ్ శింబు ఫస్ట్ లుక్ ట్రెండింగ్‌లో ఉండగా.. ప్రార్థనలో మునిగిపోయే వ్యక్తి పాలిటిక్స్ ప్రెజర్స్‌ను ఎలా డీల్ చేశాడన్నదే కథ అని తెలుస్తోంది.

వెంకట్ ప్రభు పాలిటిక్స్ అంటూ వస్తున్న ఈ చిత్రంలో పొలిటికల్ ప్రోగ్రామ్స్‌కు ఫుడ్ సప్లయ్ చేసే వ్యక్తిగా శింబు కనిపిస్తాడని సమాచారం. కానీ ఆ టైమ్‌లో తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? రాజకీయ నాయకులకు ఎందుకు ఎదురు నిలిచాడు? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని టాక్. అయితే డైరెక్టర్ వెంకట్ ప్రభు.. ఈ కథను ముందుగా ఇళయ దళపతి విజయ్‌కు చెప్పాడని, తను రిజెక్ట్ చేయగా, శింబు ఓకే చేశాడని సమాచారం.

కాగా మానాడులో ముస్లింగా, ఈశ్వరన్‌లో ఈశ్వరుడి భక్తుడిగా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ ప్రాజెక్టులను ఎంచుకున్న శింబు.. తమిళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయబోతున్నాడు అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story