ఫస్టైమ్.. కరోనా రోగికి ఊపిరితిత్తులు చేంజ్

by Anukaran |
ఫస్టైమ్.. కరోనా రోగికి ఊపిరితిత్తులు చేంజ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో మొదటిసారిగా కరోనా రోగికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స చేశారు. గురుగ్రామ్ కు చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి గతకొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిందిగా గుర్తించారు. ఈ క్రమంలో అతడికి ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

ఈ విషయమై శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ మాట్లాడుతూ.. పేషెంట్ కు విజవంతంగా ఆపరేషన్ చేయగలిగామని, అతడికి కరోనా సోకిందని.. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని శస్త్ర చికిత్స చేసినట్లు చెప్పారు. చెన్నైలోని మరో ప్రైవేట్ హాస్పిటల్‌లో మెదడు చనిపోయిన దాత నుండి ఊపిరితిత్తులను సేకరించి ఇతడికి మార్పిడి చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed