ఎల్ అండ్ టీ త్రైమాసిక లాభం రూ. 3,197 కోట్లు!

by Harish |
ఎల్ అండ్ టీ త్రైమాసిక లాభం రూ. 3,197 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 6 శాతం క్షీణించి రూ. 3,197 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది నికర లాభం 3,418 కోట్లని తెలిపింది. అలాగే, కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం 2 శాతం పెరిగి రూ. 44,245 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 43,303 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 6.14 శాతం పెరిగి రూ. 10,239.71 కోట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ. 9,647.25 కోట్లు. గతంలో ప్రకటించినట్టుగానే ప్రతి షేర్‌కు రూ. 10 మధ్యంతర డివిడెండ్ కాకుండా ఈక్విటీ షేర్‌కు రూ. 8 తుది డివిడెండ్‌ను కంపెనీ సిఫారసు చేసింది. చివరి త్రైమాసికంలో ఆర్డర్ ఇన్‌ఫ్లో రూ. 57,785 కోట్లుగా ఉందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధి అని, అలాగే మౌలిక సదుపాయాల విభాగంలో గణనీయమైన ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. భారత్‌లో అంతకుముందే ఉన్న వృద్ధి మందగమనం నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరోనా సంక్షోభం వచ్చిందని, దీంతో కంపెనీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయని సూచించింది. దీనివల్ల డిమాండ్, సరఫరా తగ్గాయని పేర్కొంది. “2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని భావిస్తున్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో వృద్ధి పునరుజ్జీవనం ఉంతుందని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed