AP Elections 2024 Results: టీడీపీ Vs వైసీపీ.. వెనుకంజలో కొనసాగుతున్న నేతలు వీళ్లే..!

by Indraja |   ( Updated:2024-06-04 05:30:47.0  )
AP Elections 2024 Results: టీడీపీ Vs వైసీపీ.. వెనుకంజలో కొనసాగుతున్న నేతలు వీళ్లే..!
X

దిశ వెబ్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దేశ రాజకీయాలన్ని ఒకలెక్క, ఆంధ్రా రాజకీయాలు ఒకలెక్క అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. అధికారం చేజారకుండా వైసీపీ, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టీడీపీ సాయశక్తులా కృషి చేసాయి. ఇక వైసీపీ నేతలు ఎన్నికల కోడ్‌ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించారు అనే వార్తలు సైతం వెలుగు చూశాయి.

ఇక ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లారు. వైసీపీ నేతలు సైతం.. టీడీపీ, జనసేన, బీజేపీ ఎందరు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేరని, 2024 ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక మంత్రి రోజా, అంబటి, తదితర మంత్రులు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం అనే విషయాన్ని మరిచిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైసీపీ మంత్రలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని ప్రతిపక్షపార్టీనేతలు అన్నట్టే ప్రస్తుతం వైసీపీ కీలక మంత్రులు అంబటి, రోజా, పెద్దిరెడ్డి, ఉషశ్రీ చరణ్, ధర్మాన, స్పీకర్ తమ్మినేని, బొత్స, అమర్నాథ్, వెనకంజలో కొనసాగుతున్నారు. కాగా కౌంటిగ్ మధ్యలోనే కొడాలి నాని వెళ్లిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed