- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CPIM నేత తమ్మినేనితో డిప్యూటీ CM భట్టి విక్రమార్క భేటీ

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సీపీఐఎం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భట్టి మార్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తమ్మినేనిని భట్టి కోరారు. కాగా, తెలంగాణలో సీపీఐఎం పార్టీ ఒకే ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎండీ జహంగీర్ బరిలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో భువనగిరి మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో సీపీఐఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read...
Next Story