నిప్పుల వాగు

by Ravi |   ( Updated:2025-01-26 23:00:38.0  )
నిప్పుల వాగు
X

ఎందుకో ఆకాశం ఎరుపెక్కింది

అరుణోదయం కాదది...

సాయం సంధ్యా కాదూ...

అయినా ఎందుకో ఆకాశం ఎరుపెక్కింది.

మండే కొలిమిలా...

రక్తపు రంగు పులుముకొని

అల్లకల్లోలమై నిలకడలేని నింగి

ఎందుకో ఎరుపెక్కింది.

అది...

వైధవ్యపు పడగ నీడ పడిన

పడతి పసుపు కుంకుమ ఎరుపు.

సంప్రదాయపు ఉచ్చు బందుకై

ఇంతి గొంతు నులిముతూ...

జీవచ్చవాన్ని చేసింది.

పితృస్వామ్య ఆధిపత్యపు బానిసలా...

ఆచారాల ముళ్ల కంచెలో....

ముగ బొమ్మలా మారింది మగువ.

ఆవుల రేణుక

93982 68976

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed