విముక్తి యుద్ధానికి ఊపిరి..!

by Ravi |   ( Updated:26 Jan 2025 11:30 PM  )
విముక్తి యుద్ధానికి ఊపిరి..!
X

వాడు మిమ్ముల

అంతం చేశానంటున్నాడు

హతమయ్యారంటున్నాడు

మా కళ్ళ నీటి సుడుల్లో

మెలిపెడుతున్న మా గుండె మంటలో

దిగంతాలకు విస్తరించిన నీలి నింగిలో

వెలుగులు చిమ్ముతున్న పాలపుంతలో

పారే ఏటి నీటి ఊటలో

రైతు పొలంలో కార్మికుడి ఒంటి చెమటలో

మిమ్మల్నే చూస్తున్నాం మేము

అంతెందుకు చంపేశానని

బీరాలు పోయినోడి కునుకులేని

ఉలికిపాటులోనూ మీరే కదా

నెత్తురోడిన కలకత్తా వీధులు

ఏరులు పారిన సిక్కోలు యోధుల రక్తం

దండకారణ్యానికి పురుడు పోసింది

జల్లెడవుతున్న దండకారణ్యo

భారత విముక్తి యుద్ధానికి ఊపిరి పోస్తోంది.

విప్లవాలన్నీ

అసమాన త్యాగాలతో

నిలిచి గెలిచినవే

నెత్తుటి క్రీడలో గెలిచిన

నియంత ఎవడూ లేడు

జోహార్ ఘరియాబంద అమరులకు

బాల్‌రెడ్డి జిట్టా

89782 21966

Advertisement

Next Story