తాజ్‌మహల్‌కు పిడుగు దెబ్బ

by Shamantha N |
తాజ్‌మహల్‌కు పిడుగు దెబ్బ
X

ఆగ్రాలోని పలుచోట్ల శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సందర్భంగా సంభవించిన పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌ కూడా ఈ పిడుగుపాటుకు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బయటికొచ్చిన ఫొటోల్లో పిడుగుపాటు వల్ల పాలరాయి రెయిలింగ్స్ కొద్దిగా నాశనమైనట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా చెక్కతో చేసిన ప్రధాన గేటు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

125 కి.మీ.ల వేగంతో వీచిన గాలుల వల్ల తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా నష్టం వాటిల్లిందని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అంకిత్ నామ్‌దేవ్ తెలిపారు. యుమునా నది వైపుగా ఉన్న పాలరాయి రెయిలింగ్స్ కొద్దిగా పాడైనట్లు ఆయన స్పష్టం చేశారు. దానికి ఆనుకుని ఉన్న ఎరుపు రెయిలింగ్ పూర్తిగా ఊడిపోయి కింద పడిందని అంకిత్ చెప్పారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే రిపేర్ పనులు మొదలు పెడతామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed