- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వావ్.. తక్కువ ధరకే లభించే ఈ పండుతో ఆ సమస్యలన్నీ పరార్..

దిశ, వెబ్‌డెస్క్: మనందరికి ఆరెంజ్ పండ్లు తెలుసు. రుచికి కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా చాలా బాగుంటాయి. ఇక వీటి ధర కూడా చాలా తక్కువే. సామాన్య ప్రజలు కూడా కొనుక్కొని తినే ధరకే లభ్యం అవుతున్నాయి. అయితే వీటిని ప్రతిరోజూ తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ తినడం ద్వారా.. మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంటారని.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం వల్ల ఒక వ్యక్తిలో డిప్రెషన్ 20 శాతం తగ్గుతుందట. మరి ఇంకా ఈ పండుతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం..
సిట్రస్ పండ్లు పేగులో కనిపించే బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయని.. మానసిక స్థితిని మెరుగు పరిచే రెండు మెదడు రసాయనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని అంటున్నారు నిపుణులు. అలాగే సిట్రస్ పండ్లలో సెరోటోనిన్, డోపమైన్ కనిపిస్తాయి. ఇది నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎందుకంటే సిట్రస్ పండ్లు ఫేకాలి బాక్టీరియం ప్రస్నిట్జి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. ఇది మానవ ప్రేగులలో కనిపించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియా. ఇది న్యూరోట్రాన్స్మిటర్లు సెరోటోనిన్ అండ్ డోపమైన్‌లను పెంచుతుంది. దీంతో నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి నారింజ పండ్లు తినండి..
మీరు మీ ఆహారంలో నారింజ పండ్లను చేర్చుకుంటే కచ్చితంగా నిరాశ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడం, ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడం, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. వీటిని రెగ్యులర్‌గా తినండి అన్ని సమస్యలకు చెక్ పెట్టండి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.