ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా ఎందుకు నిద్రపోతున్నారో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-01-25 12:11:47.0  )
ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా ఎందుకు నిద్రపోతున్నారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఒంటరిగా పడుకోవడానికే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఒక రూమ్ మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నారు. అయితే ప్రాచీనకాలంలో కలిసుంటే కలదు సుఖం.. కమ్మని సంసారంలా ఉండేదంట. సింగిల్‌గా కాకుండా గుంపులు గుంపులుగా నిద్రపోయేవారంట.స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులే కాదు, రోడ్డుపై పోయేవారు కూడా పరిచయం లేని వ్యక్తుల పక్కకు వచ్చి పడుకునేవారంట.ఈ పద్ధతి పందొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో చాలా సర్వసాధారణం అంట.కానీ ఈ పద్ధతిని కాలక్రమేణ ప్రజలు విస్మరించడం మొదలు పెట్టారు. పెళ్లైన వారు,అందరూ ఒకే దగ్గర పడుకోవడంతో సమస్యలు తలెత్తుతాయని భావించిన వారు మెళ్లి మెళ్లిగా ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకున్నారంట. అలా ఈ సామాజిక నిద్ర అనేది కనుమరుగైందంట.

ఇక గతంతో పోలిస్తే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సింగిల్ పాసంగే అనేవిధంగా తయారైంది. కనీసం తల్లిదండ్రుల‌తో కూడా కలిసి పడుకోవడానికి ఇష్టపడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ అంత కలిసి రాత్రి వరకు కబుర్లు చెప్పుకొని, చాప వేసుకొని అమ్మమ్మలు,తాతయ్యలు, మనువలు, మనుమరాండ్లు ఇలా అందరూ ఒకే చోట కథలు చెప్పుకుంటూ పడుకునేవారు కానీ ఈ సంప్రదాయం క్రమంగా తగ్గుతూ సింగిల్ బెడ్ షేరింగ్‌కు వచ్చింది.చారిత్రక కోణం నుంచి చూసినపుడు ఆధునిక కాలంలో మనిషి ఒంటరిగా, ప్రైవేట్‌గా నిద్రపోవడం కాస్త విడ్డూరంగా అనిపించినా, పురాతన కాలం నుంచి సమాజంలో కాలక్రమంగా మార్పులు వస్తుండటంతో అందరూ ఒంటరిగా పడుకోవడం మొదలైంది.

ఇది ఏస్థాయికి చేరుకుందంటే ఉన్నత వర్గాల్లోని వ్యక్తులు వివాహం తర్వాత కూడా ఒంటరిగా పడుకునేందుకే ఆసక్తి చూపుతున్నారంట. అంటే కనీసం భార్య భర్తలు కూడా కలిసి ఒకే బెడ్‌పై పడుకోవడానికి ఆసక్తిచూపడం లేదంట మనమే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో?.

Advertisement

Next Story