రాఖీ రోజు ఎలాంటి హారతి పళ్లెం ఉపయోగించాలి.. అందులో ఇవి తప్పకుండా ఉండాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు

by Anjali |
రాఖీ రోజు ఎలాంటి హారతి పళ్లెం ఉపయోగించాలి.. అందులో ఇవి తప్పకుండా ఉండాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు
X

దిశ, ఫీచర్స్: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. ఈ రాఖీని సోదర సోదరీమణులు అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఒకరికొకరు అండగా ఉంటామని భరోసానిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా, తోబుట్టిన వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అయితే పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 వ తారీకున వస్తుంది.

అనగా రేపు సోదరీమణులంతా తమ తమ సోదరులకు రాఖీ కడుతారు. ఎంత దూరాన ఉన్న తమ పుట్టింటికి వెళ్లి బ్రదర్స్ కు రాఖీ కడుతారు. అనంతరం అన్నాదమ్ముళ్లు తమ సిస్టర్స్‌కు బహుమతులు సమర్పిస్తారు. అయితే రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఈ విషయం గుర్తుంచుకోవాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. సాధారణంగా రాఖీ కట్టేటప్పుడు హారతి పళ్లెం తీసుకుంటారు. అందులో రాఖీలు, కుంకుమ, అక్షింతలు, దీపాన్ని ఉంచుతారు.

అయితే అన్నాదమ్ముళ్లకు మంచి జరగాలంటే వెండి ప్లేట్ తీసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా అందులో ఓం లేదా స్వస్తిక్, విరిగిపోయిన బియ్యాన్ని అక్షింతలుగా తయారు చేసుకోండి. కుంకుమ భరిణి, మంచినీటితో నింపిన చిన్న సైజ్ కలశం, నెయ్యితో కలిగిన దీపం, మిఠాయిలు వెండి పళ్లెంలో ఉంచండి. మిఠాయిలు సోదరులకు తినిపించడం వల్ల సోదరసోదరిమణుల మధ్య ప్రేమ మరింత బలపడుతుందని జ్యోతిష్యలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed