Viral video: పక్కనే ఉండి కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు..

by Dishafeatures1 |
Viral video: పక్కనే ఉండి కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు..
X

దిశ,ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పందిరి లో ఏ చిన్న ఈవెంట్ జరిగిన అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటోంది. అయితే.. కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటే..మరికొన్ని వీడియోలు మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో పెళ్లి కూతురు చేసిన ప్రాంక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వధూవరులు ఇద్దరు సోఫాలో కూర్చుని ఉంటారు. కాకపోతే వధువు మాత్రం ముఖంపై ముసుగు ధరించి కూర్చుని ఉంటుంది.

అలాగా కొద్దిసేపు సైలెంట్ గా ఉన్న వరుడు ఆ తర్వాత వధువు ముఖం చూడాలని ప్రయత్నించి పెళ్లి కూతురు ముఖంపై ఉన్న ముసుగు మెల్లగా తీసి చూసేసరికి పెళ్లి కూతురు ఉన్నచోట ఓ యువకుడు ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయి తను ఫూల్ అయ్యానని తెలుసుకున్న వరుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి.. అక్కడ ఉన్న వారితో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు.

తనని ఫూల్ చేస్తారా అంటూ.. పెళ్లి కూతురు వేషంలో ఉన్న అతడిపై చేయి చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా తెగ నవ్వుకుంటారు. ఇకపోతే అచ్చం అదే రంగులో గల చీర కట్టుకున్న వధువు ఆ రూమ్ లోనే పక్కనే కూర్చుని దగ్గరుండి చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో కు సంబంధించి నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇందులో కొందరైతే పెళ్ళికొడుకును భలే ఫూల్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.

Read More...

కుక్కలతో ఆడుకుంటే ఎఫెక్ట్ అవుతున్న బ్రెయిన్.. పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Next Story

Most Viewed