- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 ఏళ్ల చిన్నారి ఒంటిరిగా వెళ్లింది! తల్లే దీనికి కారణం!!
దిశ, వెబ్‌డెస్క్ః ఏడేళ్ల చిన్నారుల్ని స్కూల్‌కి పంపడానికే ఎంతో జాగ్రత్తపడుతుంటారు చాలా మంది తల్లిదండ్రులు. ముంబాయ్‌లోని ఓ తల్లి తన 7 ఏళ్ల కూతర్ని ఏకంగా విమానంలోనే ఒంటరిగా ప్రయాణం చేయమంది. అందులోనూ పాప విమానం ఎక్కడం కూడా మొదటిసారే కావడం మరింత విశేషం. అయితే, ఇది కేవలం తల్లి ప్రోత్సహంతోనే సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాలా. అంత చిన్న వయసులో ఇలాంటి సాహసం చేయాలని ముందుకు రావడం ఈ చిన్నారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని తెలియజేస్తుంది. కొన్ని సార్లు ఇలాంటి ప్రయాణాలు తప్పనిసరై చేయాల్సి రావచ్చు. అయినా, ఆ చిన్నారి అంత ధైర్యంగా ప్రయాణం చేసిందని తెలిసి, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ ఏడేళ్ల అనయా వడోదర నుంచి ముంబైకి ఒంటరిగా ప్రయాణించిందని తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలిక తల్లి ఇష్నా బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ క్లిప్‌లో చిన్నారి ఫ్లైట్ ఎక్కే ముందు విజువల్స్ అలాగే, విమాన దిగిన తర్వాత గమ్యస్థానంలో తన తల్లిని కలుసుకున్నట్లు చూపించారు. ఈ పోస్ట్‌లో అనయా తల్లి ప్రయాణ విశేషాలను వివరంగా పేర్కొంటూ ఓ నోట్ కూడా రాసింది. వడోదర నుండి ముంబైకి ఇండిగో ఫ్లైట్‌లో వెళ్లిన తన కూతురి ఒంటరి సాహసం చెప్పుకొని, మురిసిపోయింది. అనయా తన అమ్మమ్మ ఇంటి నుండి వచ్చినట్లు తెలిపింది.