- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Valentines Week : వాలెంటైన్స్ వీక్.. ఏ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా?

దిశ, ఫీచర్స్ : ప్రతీ రోజుకు ఓ ప్రత్యేకత ఉన్నట్లే.. ఫిబ్రవరి 14కూ ఓ ప్రత్యేకత ఉంది. అదే వాలెంటైన్స్ డే. మదర్స్ డే అమ్మ కోసం, ఫాదర్స్ డే నాన్న కోసం అన్నట్లుగానే.. లవర్స్ డే ప్రేమికుల కోసం అని చెప్తుంటారు. తాము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్టపికీ మనసులో మాటను బయట పెట్టని వాళ్లు తమ ప్రియమైన వారికి ప్రపోజ్ చేయాలనుకునే ఓ ప్రత్యేక సందర్భం కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. వారికి ముందుగా కనిపించే బెస్ట్ ఆప్షనే వాలెంటైన్స్ డే అంటుంటారు ఆ రోజును సమర్థించేవాళ్లు. దాని వెనుక కథ, చరిత్ర వంటి విషయాలు ఎలా ఉన్నా, ప్రేమికులు తమ భావాలను మరోసారి స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే రోజుగా, ప్రేమకు, త్యాగానికి ప్రతీకగా వాలెంటైన్స్ డేను పరిగణిస్తారు. అయితే ఇది ఫిబ్రవరి 14న అయినప్పటికీ, వన్ వీక్ ముందు నుంచే వాలెంటైన్స్ వీక్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు ఔత్సాహికులు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై 14 వరకు కొనసాగే ఈ వారం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 7 : రోజ్ డే
వాలెంటైన్స్ వీక్‌లో మొదటి రోజు అయిన ఫిబ్రవరి 7న రోజ్ డేను జరుపుకుంటారు ప్రేమికులు. గులాబీ పువ్వులంటే ఎంత అందంగా, ఆకర్షణీయంగా, పరిమళ భరితంగా ఉంటాయో తెలిసిందే. అయితే వీటిలో అనేక రంగులు ఉండగా, ఒక్కో రంగు వేర్వేరు భావాలను సూచిస్తుంది. స్నేహానికి ప్రతీక ఎల్లో గులాబీ అయితే, ప్రేమను వ్యక్త పరిచేందుకు ఎర్ర గులాబీలు ఇస్తారు.
ఫిబ్రవరి 8 : ప్రపోజల్ డే
ఒక వ్యక్తి పట్ల ఏర్పడిన ప్రేమను వెంటనే ప్రపోజ్ చేయలేరు ఎవరైనా.. ఓ సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. అవతలి వ్యక్తిని ఇంప్రెస్ చేసేలా ప్రపోజ్ చేయాలనుకుంటారు. అలాంటి వారికోసమే ఫిబ్రవరి 8 ప్రపోజల్ డే. గ్రీటింగ్ కార్డ్, ఫ్లవర్ బొకే, అందమైన గిఫ్ట్ లేదా ఆకట్టుకునే కొటేషన్ ఇలా ఏదో ఒక రూపంలో ప్రేమను వ్యక్తం చేయడానికి, ప్రేమిస్తున్న వ్యక్తికి తెలియజేయడానికి ఈ రోజును ఎంచుకుంటారు. ఒకప్పుడు గ్రీటింగ్‌లకు, ప్రేమ లేఖలకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా ప్రపోజ్ చేయవచ్చు.
ఫిబ్రవరి 9 : చాక్లెట్ డే
వాలెంటైన్స్ వీక్‌లో మరో తీయనైన రోజు చాక్లెట్ డే. ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. ఇష్టపడే వ్యక్తులకు లేదా ప్రేమికులకు టేస్టీ టేస్టీ డార్క్ చాక్లెట్ ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకత. ఇది తినడంవల్ల బ్రెయిన్‌లో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. అందుకే సంతోషంగా కూడా ఉంటారు.
ఫిబ్రవరి 10 : టెడ్డీ డే
టెడ్డీ డే కూడా వాలెంటైన్స్ వీక్‌లో మరో ప్రత్యేక సందర్భం. ఫిబ్రవరి 10న. అంటే.. ఆ వారంలో నాలుగవ రోజున జరుపుకుంటారు. తమకు ఇష్టమైన వారికి టెడ్డీబేర్లను ఇస్తారు. అసలు ఇలా టెడ్డీ ఎందుకిస్తారంటే.. స్వచ్ఛమైన ప్రేమకు, అమాయకత్వానికి, హుందాతనానికి అది నిదర్శంగా భావిస్తారు. టెడ్డీని హగ్ చేసుకుంటే ప్రియుడు/ప్రేయసిని కౌగిలించుకున్న అనుభూతికి లోనవుతారని చెప్తుంటారు.
ఫిబ్రవరి 11 : ప్రామిస్ డే
ప్రేమలో ప్రేమొక్కటే కాదు, ప్రతిజ్ఞలు, వాగ్దానాలు, పట్టుదలలు కూడా ఉంటాయి. వాలెంటైన్స్ వీక్‌లో వచ్చే ఫిబ్రవరి 11ను అందుకు నిదర్శనంగా భావిస్తారు. అందుకే ఆ రోజున జంటలు ఒకరికొకరం తోడుంటామని, ఎల్లప్పుడూ కలిసుంటామని, కష్ట సుఖాలను పంచుకుంటామని ప్రామిస్ చేసుకుంటారు. గిఫ్టులు సైతం ఇచ్చిపుచ్చుకుంటారు.
ఫిబ్రవరి 12 : హగ్ డే
కౌగిలింతకు ఉన్న పవర్ ఎలాంటిదో అనేకమంది ప్రముఖులు, కవులు సైతం వర్ణించారు. ఇష్టమైన వ్యక్తిని హగ్ చేసుకుంటే మరో స్వర్గం అవసరం లేదని చెబుతుంటారు. ‘ఏ చల్లగాలి నన్ను తానికినా.. నీ కౌగిలింత అనుభూతులే’నని కలవరిస్తూ పలువరించిన భగ్న ప్రేమికులెంతో మంది ఉన్నారు. పరిశోధనలు సైతం హగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చాయి. అలాంటి సిచువేషన్‌ను గుర్తు చేసుకునే మరో సందర్భం ఫిబ్రవరి 12. ఈ హగ్ డే సందర్భంగా మీ ప్రియమైన వ్యక్తిని కౌగించుకుంటారు.
ఫిబ్రవరి 13 : కిస్ డే
‘ముద్దూ.. మురిపెం’ అని ఊరికే అనలేదు. అది ఇష్టమైన వ్యక్తికి ఇచ్చినప్పుడు లేదా పొందినప్పుడు ముఖంపై చిరునవ్వును, ఒంట్లో ఎనర్జీని, పెదవిపై మురిపాన్ని తెస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు మెదడులో జరిగే రసాయనిక చర్యలు అందుకు కారణం. ముఖ్యంగా ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్ల విడుదల వల్ల ముద్దు పెట్టుకునే సందర్భం మధురానుభూతికి లోనుచేస్తుంది. ఫిబ్రవరి 13న సెలబ్రేట్ చేసుకునే కిస్ డే కూడా అలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
ఫిబ్రవరి 14 : వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ప్రేమ జంట హృదయంలో మెదిలే ప్రత్యేక సందర్భం ఫిబ్రవరి 14. ప్రపంచమంతా దీనిని వాలెంటైన్స్ డే లేదా లవర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పటికే పెళ్లైన వారు తమ భాగస్వాములకు బహుమతులు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే.. ఇంకా మనసులోని మాటను బయట పెట్టని వారు ఈ రరోజు తమ ప్రియురాలు/ప్రియుడి ముందు ఓపెన్ అవుతారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ ప్రేమను అవతలి వ్యక్తికి తెలియజేస్తారు. అలాంటి ప్రత్యేక సందర్భమే వాలెంటైన్స్ డే.