Lip lock kiss : ప్రేమికులకు ఇదే ఆహ్వానం.. లిప్ టు లిప్ కిస్ పోటీలు మన దగ్గరే..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-02-06 14:27:07.0  )
Lip lock kiss : ప్రేమికులకు ఇదే ఆహ్వానం.. లిప్ టు లిప్ కిస్ పోటీలు మన దగ్గరే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వాలంటైన్స్ డే (Valentine's Day) పేరు వినగానే ప్రేమికుల మొఖంలో వెలుగులు విరజిమ్ముతాయి. బుగ్గల నిండా సిగ్గు నింపుకుని ఊహల లోకంలో విహరిస్తూ చిరునవ్వులు చిందిస్తుంటారు. ఇలాంటి లవర్స్ తమ బర్త్ డే తేది మర్చిపోయిన ఈ ప్రేమికుల దినోత్సవం (Lover's Day) డేట్ మాత్రం మర్చిపోరు. గాఢ నిద్రలో ఉన్న వారిని లేపి అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఆ డే స్పెషల్ అంతలా ఉంటుంది మరి. పాశ్చాత్య సంస్కృతి(Western culture) అయిన వాలంటైన్స్ డే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడి యువత కూడా ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈవెంట్ మేనేజర్లు ఆ రోజు లవర్స్ (Lover's) కోసం వివిధ ఆఫర్లు ప్రకటిస్తూ పోటీలు పెడుతున్నారు. మరో వారం రోజుల్లో జరుపుకోబోయే వాలంటైన్స్ డేకు యువత పోటీలు పడి ఈవెంట్ల(Valentine's Day Events)ను ఏర్పాటు చేస్తోంది.

లవర్స్‌లో మరింత ఉత్సహం నింపేందుకు ఈ సారి ముద్దుల పోటీలు(Kissing contests) నిర్వహించేందుకు ఈవెంట్ ఆర్గనైజర్లు (Event organizers) రెడీ అయ్యారు. ముద్దుల పోటీ అంటే బుగ్గల మీదో నుదుటి మీదో కాదు.. లిప్ టు లిప్ కిస్(Lip to lip kiss). ఎవరు ఎంతగా జుర్రుకుంటే వాళ్లే విజేతలు కానున్నారట. ఇందులో భాగంగా ఇన్విటేషన్ కార్డును ప్రింట్ చేసి సోషల్ మీడియా వేధికగా వైరల్ చేస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు కొన్ని నిబంధనలు ఉంటాయని క్లియర్ ప్రకటించారు. 15 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల ఏజ్ ఉన్న వాళ్లు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. జంటగా వచ్చే వారికే ఎంట్రీ అని, సింగిల్‌గా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. పైన పేర్కొన్న వయసుల ఆడ, మగలకు ఆహ్వానం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పశ్చిమ బెంగాల్ (West Bengal)రాష్ట్రం, జల్పాయిగిరి(Jalpaigiri) జిల్లా కేంద్రంలోని మక్రేపారా ప్లే గ్రౌండ్‌(Makkrepara Play Ground)లో ఈ లిప్ టు లిప్ కిస్ పోటీలు(Lip kiss competition) నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకు అంటూ 3 గంటలపాటు ఈ ముద్దుల క్రీడాపోటీలు నిర్విరామంగా జరగనున్నాయి.

అయితే ఈ లిప్ టు లిప్ కిస్ పోటీలపై నెటిజన్లు మండిపడుతున్నారు. విదేశీ కల్చర్‌ను మనపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసాంఘిక పోటీల వల్ల యువత చెడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల మైనర్లను ఎలా ఎంట్రీ చేస్తారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత బహిరంగంగా వాలంటైన్స్ డే ఈవెంట్స్‌కు ఏర్పాట్లు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొందరు మాత్రం.. ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. ఆ రోజు ప్రియురాలితో అందుకునే తియ్యటి ముద్దు.. జీవితకాలం పదిల పర్చుకుందాం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed