కాల్షియం లోపంతో ఇబ్బంది పడే వారు.. వీటిని తీసుకుంటే చాలు

by Prasanna |   ( Updated:2023-01-21 10:12:52.0  )
కాల్షియం లోపంతో ఇబ్బంది పడే వారు..  వీటిని తీసుకుంటే చాలు
X

దిశ, వెబ్ డెస్క్ : శరీరంలో పోషకాహార లోపం రావడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో కాల్షియం తగ్గినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పాలను, ఆకు కూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంత మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. ఇతర ఆహార పదార్ధాల నుంచి కాల్షియం అందుతుంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

తెల్ల బఠానీలు

తెల్ల బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్స్ తో కాల్షియం ఉంటుంది. మీరు వీటిని బాగా ఉడికించి.. వాటిలో నిమ్మ, ఉల్లిపాయ వేసుకుంటే తింటే రుచిగా ఉంటుంది. మరి కొంతమంది అయితే తెల్ల బఠానీల పులుసు చేసుకొని తింటుంటారు.

బాదం

బాదంలో క్యాల్షియం అధికంగా దొరుకుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. పావు కప్పు బాదంపప్పులో మీకు 320 మిల్లీగ్రాముల కాల్షియంను లభిస్తుంది. కాల్షియం మాత్రమే కాకుండా దీనిలో ఫైబర్, విటమిన్ E ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Vegetables ను వండుకొని తినడం ద్వారా.. ఏమౌతుందో తెలుసా ?

Advertisement

Next Story

Most Viewed