- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషి చెడిపోకుండా ఉండాలంటే తాబేలు నుంచి నేర్చుకోవాల్సింది ఇదే..
దిశ, వెబ్ డెస్క్: తాబేలు దానికి ఏదైనా ప్రమాదం ఎదురవుతుంది అనే పసిగట్టగానే తన నాలుగు కాళ్లు మరియు దాని తల లోపలికి పెట్టి దాని డిప్పలో సురక్షితంగా ఉంటుంది. ఆ డిప్పలోకి వెళ్లితే దానిని ఎవరు ఏం చేయలేరు. ఏదైనా ప్రమాదం వచ్చినా, అలికిడి విన్నా, తనకు ఏం జరుగుతుందో అన్నా భయంతో నాలుగు కాళ్లని తలకాయను లోపలికి లాగేసుకుంటుంది.
అలాగే మన మనసు ఇంద్రియాల ద్వారా గ్రహించిన ‘ ఈ శబ్దాలు మాటి మాటికి విందాం.. ఈ స్పర్శ మళ్లీ మళ్లీ పొందుదాం.. ఈ రూపం అక్రమమైన సరే అది నాకు చెందవలసిందే.. ఈ రుచి నాకు అరగకున్నా సరే, అనారోగ్యమైన సరే నేను ఇదే తింటా.. ఈ గంధం నాకు ఇబ్బంది అయినా సరే ఈ గంధమే కావాలి ఎంత ఖరీదైనా సరే..’ అని ఇంద్రియాల ద్వారా మన మనసు వ్యామోహాలకు లోనవుతున్నప్పుడు ఆ ఇంద్రియాలను, మన మనసును వెనక్కు లాగేసుకోవాలి. ఇదే కమఠంపు నివృత్తి అంటారు. ఇదొక్కటి చేయగలిగితే ప్రపంచంలో ఏ అనర్థాలు జరుగవు. ఏ మనిషి కూడా చెడుగా మారడు.