- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయురాలిని చితక్కొట్టిన టీచర్లు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు దారితప్పి ప్రవర్తించారు. విద్యార్థుల ముందే క్లాస్ రూమ్‌లో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో జరిగింది. కొరియా పంచాయతీలోని ఓ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, ఉపాధ్యాయురాలు అనితా కుమారి మధ్య కిటికీ తెరిచే విషయంలో మాటా మాటా పెరిగింది. దీంతో మొదట క్లాస్ రూమ్‌లోనే గొడవకు దిగగా ఆ తర్వాత బయటకు వచ్చి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారిపై అనిత కుమారి దాడి చేయగా అనితకు తోడుగా మరో మహిళా టీచర్ జతచేరింది.
ఆ ఇద్దరు కలిసి కాంతి కుమారిపై దాడి చేశారు. జుట్లు పట్టుకుని, చెప్పులు, కర్రతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా తన్నుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న స్థానికులు కలగజేసుకుని గొడవను ఆపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ స్పందిస్తూ వారి వ్యక్తిగత కారణాలతోనే వారు గొడవ పడ్డారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు టీచర్లకు నోటీసులు జారీ చేశారు.
#Patna #Bihta #koriya #Panchayat की #शिक्षिका से #परीक्षा ना लेना #सरकार इन्हें आता है #जूतम_पैजार #NitishKumar #Teacher #fight #MiddleSchool pic.twitter.com/ZTI0mbF5YX
— JOURNALIST SARVESH (@sarveshmediaman) May 25, 2023