- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మైల్డ్ కోవిడ్.. శిశువుల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌పై ఎఫెక్ట్ చూపుతుందా?
దిశ, ఫీచర్స్: ప్రెగ్నెన్సీ టైమ్‌లో మైల్డ్ కోవిడ్ (లక్షణ రహిత కోవిడ్) బారినపడిన తల్లులకు జన్మించే శిశువులలో మెదడు ఎదుగుదల సరిగ్గా ఉండదనే అపోహలు ఇటీవల వ్యాప్తి చెందాయి. అయితే ఇవి నిజం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘మైల్డ్ కోవిడ్ శిశువులు- మెదడు ఎదుగుదలపై ప్రభావం’ అంశంపై కొలంబియాకు చెందిన పీడియాట్రిక్స్ అండ్ సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాని డుమిట్రియు(Dani Dumitriu) టీమ్ పరిశోధనలు నిర్వహించింది. ఇందులో భాగంగా యూఎస్‌లో 5 నుంచి 11 నెలల మధ్య వయస్సు గల 407 మంది శిశువులను ఈ టీమ్ స్టడీ చేసింది. గర్భధారణ సమయంలో కోవిడ్ బారిన పడిన తల్లలులకు జన్మించిన మూడింట ఒక వంతు మంది శిశువులను అధ్యయనకర్తలు పరిశీలించారు. అయితే చిన్నారుల మెదడు ఎదుగుదలలో ఎటువంటి ప్రమాదకరమైన మార్పులు, లోపాలు కనిపించలేదని డుమిట్రియు టీమ్ పేర్కొన్నది. గర్భవతి అయిన మహిళ కోవిడ్ బారిన పడితే పుట్టబోయే పిల్లల మెదడుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది. అలాగే మైల్డ్ కోవిడ్ బారిన పడిన శిశువులలో కూడా మెదడు ఎదుగుదలపై ఎటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: Onion: ఉల్లిపాయతో ఇన్ని ప్రమాదాలున్నాయని తెలుసా?