- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
37 ఏళ్లుగా మూతపడ్డ థీమ్ పార్క్.. భయంతో వణుకుతున్న ప్రజలు..
దిశ, ఫీచర్స్ : ఎప్పుడు ఏదో ఒక అడ్వెంచర్ చేసే వ్యక్తులకు లోకంలో కొరత లేదు. కొన్నిసార్లు వారు పర్వతారోహణ చేస్తుంటారు. కొన్నిసార్లు వారు పారాచూట్‌తో పర్వతాల నుండి దూకుతారు. అటువంటి వ్యక్తులకు థ్రిల్ అనుభూతిని అందించడానికి కొన్ని థీమ్ పార్కులను నిర్మించారు. ఇందులో రోలర్ కోస్టర్‌తో సహా అనేక రకాల ఉత్తేజకరమైన గేమ్‌లు ఆడతారు. ఉక్రెయిన్‌లో ఇలాంటి థీమ్ పార్క్ ఉంది. ఇది సుమారు 37 - 38 సంవత్సరాల క్రితం ప్రజల వినోదం కోసం నిర్మించారు. అయితే ఈ థీమ్ పార్క్ ను ఇప్పటివరకు తెరవలేదు. నేటికీ ఇక్కడికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.
హంటెడ్ థీమ్ పార్క్ లాగా కనిపించే ఈ పార్క్ ఉక్రెయిన్ ఉత్తర భాగంలో 'ప్రిప్యాట్ అమ్యూజ్‌మెంట్ పార్క్' పేరుతో ఉంది. థీమ్ పార్క్‌లో లభించే అన్ని ఉత్తేజకరమైన గేమ్‌లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఎవరూ ఇక్కడికి రారు. ఈ నిర్జన ఉద్యానవనం ఎవరినీ వెంటాడేది కానప్పటికీ ఇక్కడి భయానక దృశ్యాలు, భయానక కథనాలు ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తాయి.
పార్కు ఎప్పటికీ తెరవలేదు..
LadBible నివేదికల ప్రకారం ఈ పార్క్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అంటే మే 1986లో ప్రారంభించాల్సింది. అయితే చెర్నోబిల్‌లో జరిగిన ఘోరమైన అణు విపత్తు కారణంగా, 'ప్రిప్యాట్ అమ్యూజ్‌మెంట్ పార్క్' ప్రారంభానికి ముందే మూసివేశారు. నేటికీ ఈ పార్క్ ప్రపంచంలోని ప్రతి మూలను కదిలించిన విపత్తును గుర్తు చేస్తుంది. పార్కు ప్రారంభోత్సవానికి ఏ విధంగా అలంకరించారో, ఆ అలంకారం నేటికీ కనిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అడవిలో పచ్చదనం సంతరించుకుంది.
రేడియేషన్ స్థాయి ప్రమాదకరం..
ఆ అణు విపత్తు వల్ల ఈ పార్క్ లో రేడియేషన్ స్థాయి కూడా బాగా పెరిగిందని, నేటికీ ఇక్కడ రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు అక్కడి ప్రజలు. ఈ పార్క్ ఎప్పుడూ తెరవకపోవడానికి కారణం ఇదే. కొంతమంది సాహసం చేసేవారు ఇక్కడకు తిరుగుతూ ఉంటారు. కానీ ఎక్కువ సేపు ఉండేందుకు అస్సలు ప్రయత్నించ వద్దంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రేడియేషన్ స్థాయి చాలా ప్రమాదకరమైనది, ఇది ఎవరికైనా అస్వస్థత కలిగించేలా చేస్తుంది.