సజీవ ‘బాంబు’లాంటి సరస్సు.. నీటి దగ్గరకు వెళ్తే దుస్తులు పైకి లేవాల్సిందే..!

by Sumithra |   ( Updated:2024-08-03 13:22:14.0  )
సజీవ ‘బాంబు’లాంటి సరస్సు.. నీటి దగ్గరకు వెళ్తే దుస్తులు పైకి లేవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నదుల్లో, సరస్సుల్లో స్నానం చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సెలయేరులో పారే నిర్మలమైన నీళ్లు అలా పాదాలను తాకూతూ పోతుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన నీటిని చూస్తే చాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతటి అందమైన సరస్సులో ప్రాణాలను హరించే సరస్సులు కూడా ఉన్నాయంటే నమ్ముతారా...? ఏ క్షణంలో ఆ సరస్సులో విస్పోటనం జరుగుతుందో అని పర్యాటకులు భయపడుతూ ఉంటారు. ఇంతకీ ఈ డెత్ ఎక్కడ ఉంది, అందులో ఎందుకు విస్పోటనాలు జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఖండమైన ఆఫ్రికాలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య 'కివు' అనే సరస్సు ఉంది. రెండు మిలియన్ల జనాభాతో ఉన్న ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సులలో కివు ఒకటి. ఈ సరస్సుకు సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలు ఈ సరస్సులో స్నానానికి వెళ్లినప్పుడు, వారి దుస్తులు అలా గాలిలోకి ఎగురతాయట. అంతే కాదు ఈ సరస్సులో దిగిన వారు ఎప్పుడు మరణాన్ని ఎదుర్కోవచ్కో చెప్పలేరట.

కివు సరస్సు ఎందుకు ప్రాణాంతకం ?

కివు సరస్సులో లోతులో కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్‌తో నిండిన భారీ నీటి సరస్సు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఎటువంటి హెచ్చరిక లేకుండా ఎప్పుడైనా విస్పోటనం చెందే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఆఫ్రికాలోని మరో రెండు సరస్సులు కూడా ఇలాంటి ప్రాణాంతక రసాయనాలతో నిండి ఉన్నాయట. ఒక సరస్సు పేరు న్యోస్, మరొకటి మోనాన్, రెండు సరస్సులు కామెరూన్‌లో ఉన్నాయట.

వేలాది మంది ప్రాణాలను బలిగొన్న సరస్సు...

గత 40 సంవత్సరాలలో, లేక్స్ న్యోస్, మోనోన్ రెండు సరస్సుల్లో విస్ఫోటనం చెందాయని చెబుతారు. దీంతో మొత్తం 1,800 మంది ప్రజలు, వేలాది జంతువులు చనిపోయాయట. అదే సమయంలోనే కివు సరస్సు ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సులలో ఒకటి, ఇది తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ అని పిలిచే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో వ్యాపించిందని చెబుతారు. చీలికలో సోమాలియన్ టెక్టోనిక్ ప్లేట్ తూర్పు వైపు కదులుతుంటాయట. ఖండంలోని మిగిలిన ప్రాంతాల నుండి నుబియన్ ప్లేట్‌పైకి కదులుతుంటాయట. సోమాలియన్ ప్లేట్‌ను సోమాలి ప్లేట్ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే నుబియన్ ప్లేట్‌ను కొన్నిసార్లు ఆఫ్రికన్ ప్లేట్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఈ కదలిక ఈ ప్రాంతంలో అగ్నిపర్వత పేలుళ్లకు, భూకంపాలకు కారణమవుతాయంటున్నారు పరిశోధకులు.

కివు సరస్సు..

కివు సరస్సు న్యోస్ లేదా లేక్ మోనాన్ కంటే చాలా పెద్దది. దీని పొడవు 90 కిలోమీటర్లు, వెడల్పు 50 కిలోమీటర్లు, లోతు 1,560 అడుగులు (475 మీటర్లు)లు ఉంటుందంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా డులుత్‌లోని ఫిజికల్ అండ్ జియోకెమికల్ లిమ్నాలజీ ప్రొఫెసర్ సెర్గీ కాట్సేవ్ నేషనల్ జియోగ్రాఫిక్‌తో మాట్లాడుతూ సరస్సు కూర్పు భిన్నంగా ఉందని చెప్పారు. దాని పొరలు సాధారణమైనవి కావు. దీనిలో ఎగువ 200 అడుగుల (60 మీటర్లు) నీరు మాత్రమే క్రమం తప్పకుండా కలిసిపోతుందట. కానీ దిగువ పొరలు అలాగే ఉంటాయని చెబుతున్నారు. ఈ గట్టి ఐసోలేషన్ లో CO2, మీథేన్ వాయువులు 850 అడుగుల (260 మీటర్లు) లోతు వరకు దిగువ పొరలో చిక్కుకుపోయి నిల్వ ఉంటాయంటున్నారు.

కివులో ఎంత శాతం CO2, మీథేన్ ఉంది ?

కివు సరస్సు దిగువన 300 క్యూబిక్ కిలోమీటర్ల CO2, 60 క్యూబిక్ కిలోమీటర్ల మీథేన్ ఉందని కాట్సేవ్ చెబుతున్నారు. ఇది భూమి క్రస్ట్‌లో లోతుగా ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులో ఉంటుందట. ఈ విషపూరిత కాక్‌టెయిల్ త్వరలో చుట్టుపక్కల జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా అనారోగ్యం, మరణాల ప్రమాదం ఉందంటున్నారు.

కివు సరస్సు ఎప్పుడు విస్పోటనం చెందుతుంది..?

కెనడా ఆధారిత కంపెనీ హైడ్రాగాస్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, ఇంజనీర్ ఫిలిప్ మోర్కెల్ నేషనల్ జియోగ్రాఫిక్‌తో మాట్లాడుతూ సరస్సులో పేలుడు సంభవించినట్లయితే, భారీ గ్యాస్ మేఘం విడుదల అవుతుందని, ఇది చాలా రోజులు, వారాల వరకు సరస్సు పై వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీని తర్వాత అది భూమి వాతావరణంలో వ్యాపిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story