24x7 మెంటల్ హెల్త్ సర్వీస్.. 20 రాష్ట్రాల్లో టెలీ-మనస్

by sudharani |
24x7 మెంటల్ హెల్త్ సర్వీస్.. 20 రాష్ట్రాల్లో టెలీ-మనస్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 'టెలీ-మనస్' పేరుతో 24x7 టెలీ సర్వీస్‌ను ప్రారంభించింది. క్రమంగా ఈ సేవలు దేశం మొత్తానికి విస్తరించనుంది. Tele-MANAS అనేది నిపుణులు, ఈ-ప్రిస్క్రిప్షన్స్‌తో కౌన్సెలింగ్, కన్సల్టేషన్, థెరపీ ప్రోగ్రామ్స్ అందించడం ద్వారా మారుమూల ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సంరక్షణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు డిజిటల్ విభాగంగా పని చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని అంగీకరిస్తూనే ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా వార్షిక బడ్జెట్‌లో ప్రకటించింది కేంద్రం. వివరాల ప్రకారం, 14416 మరియు 1-800-91-4416 హెల్ప్‌లైన్ నంబర్స్‌కు కాల్ చేయడం ద్వారా ఈ సేవను యాక్సెస్ చేయొచ్చు. కాలర్‌లు ఉచిత సంప్రదింపులను యాక్సెస్ చేయగల వారి ప్రాంతాల్లో శిక్షణ పొందిన కౌన్సెలర్‌కు బదిలీ చేయబడతారు. అవసరమైతే, వారు క్లినికల్ సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సు లేదా సైకియాట్రిస్ట్ వంటి మానసిక ఆరోగ్య నిపుణులకు ఆన్‌లైన్‌లో కనెక్ట్ చేయబడతారు. వ్యక్తిగత సేవ కోసం కాలర్‌లు ఆరోగ్య, సంరక్షణ కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా సూచించబడతారు.

నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు సంబంధించి డిజిటల్ విభాగంగా ఉండే Tele MANAS కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ (NIMHANS) నోడల్ సెంటర్‌గా ఉంటుంది. దీనికి IIT-బాంబే నుంచి సాంకేతిక సహకారం అందజేయబడుతుంది. ఇక WHO ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 322.48 మిలియన్ ప్రజలు ఏదో ఒక రకమైన డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇక భారతదేశంలోని మొత్తం జనాభాలో 14 శాతానికి పైగా మానసిక రుగ్మతల వైవిధ్యాలను కలిగి ఉన్నారు. ఈ వాటాలో భారత్‌లోని వృద్ధాప్య మహిళలదే ఎక్కువ భాగం.

Advertisement

Next Story

Most Viewed