- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Health Tips : ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. ఆ వ్యాధులు కూడా దూరం!
దిశ, ఫీచర్స్ : ఇటీవల వర్షాల తర్వాత పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లతో పలువురు ఇబ్బంది పడుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేథ్యంలో వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి అనారోగ్యాలు ఏవైనా డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. అదే సందర్భంలో వ్యక్తులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారాలు కూడా వ్యాధుల నివారణకు సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.
ముఖ్యంగా డెంగ్యూ బారిన పడితే ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. వీటిని థ్రోంబోసైట్స్ అని కూడా అంటారు. శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే చిన్న రక్త కణాలు ఇవే. సాధారణంగా వీటి కౌంట్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండాలని వైద్య నిపుణులు చెప్తుంటారు. అయితే 20 వేలకు మించి పడిపోతే ప్రమాదమని, శరీరంలో రక్తస్రావం అవుతుందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వర్షాకాలంలో ముందు జాగ్రత్తగా ప్లేట్‌లెట్స్ పెంచే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. అలాంటి ఆహారాలేవో, ఏ పోషకాలు ఉంటాయో సూచిస్తున్నారు.
* గోధమ గడ్డి : రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడానికి సహాయపడే సహజమైన సూపర్ ఫుడ్స్ చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో గోధుమ గడ్డి ఒకటి. ఇందులో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుందని, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు కూడా పెరగడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గోధుమ గడ్డి రసాన్ని తీరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు.
* గుడ్మడి కాయ : రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెంచడంలో సహాయపడే మరో ముఖ్యమైన ఆహారం గుడ్మడి కాయ. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎముక మజ్జలో ప్లేట్‌లెట్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదం చేస్తుందని, ప్రోటీన్ల నియంత్రణలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
* దానిమ్మ : యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతోపాటు వివిధ పోషకాలు కూడా కలిగి ఉన్న అద్భుత ఫలం దానిమ్మ. ఇందులోని గింజలను తినడంవల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ప్లేట్‌లెట్స్ పెరుగుదలకు, వ్యాధుల రిస్కును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలో వాపును కూడా తగ్గిస్తుంది.
* చేప నూనె : చేపలు అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన హెల్తీ ప్రోటీన్స్‌ను అందించడంలో మంచి ఆహారం. కాబట్టి అప్పుడప్పుడూ చేపలను తినడం, అలాగే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
* విటమిన్ సి : తక్కువ ప్లేట్‌లెట్స్ ఉన్నవారు విటమిన్ సి కలిగిన పండ్లు, ఆహారాలను తప్పక తినాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే విటమిన్ సి ఒక ఎనర్జిటిక్ యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. కాబట్టి నారింజ, కివీ, బ్రోకలీ, బచ్చలికూర, నిమ్మ వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇవి డెంగ్యూ మలేరియా వంటి జ్వరాల నివారణలో మాత్రమే కాకుండా, చర్మ వ్యాధులు, అలెర్జీలు కూడా తగ్గుతాయని పేర్కొంటున్నారు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించగలరు.