- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పనికోసం కంప్యూటర్ల ముందు గడిపితే అంతే సంగతులు.. పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయట !
దిశ, ఫీచర్స్ : ప్రతి రోజూ ఇష్టమైన వీడియో క్లిప్‌లను చూడటం కోసమో, నచ్చిన గేమ్స్ ఆడటం కోసమో గంటల తరబడి డెస్క్‌టాప్ వద్ద మీ సమయాన్ని స్పెండ్ చేయడం లైంగిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే వర్క్ చేసేందుకు కేటాయించే సమయంలో ఈ ప్రభావం పెద్దగా ఉండటం లేదట. భావోద్వేగాలను ప్రభావితం చేసే క్లిప్లింగ్స్, పోర్న్స్ వీడియోస్ వంటివి చూడటానికి కేటాయించే అధిక సమయంవల్లే అసలు సమస్య ఎదురవుతోంది. అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవడం, ల్యాప్‌టాప్‌ను కాళ్లపై పెట్టుకొని వీడియో క్లిప్పింగ్స్ చూడంటం ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యకు కారణం అవుతుందని చైనాకు చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. క్రమంగా ఈ అలవాటు మెంటల్ హెల్త్ డిజార్డర్స్, సెల్ప్ ఎస్టీమ్ దెబ్బతినడం వంటి తీవ్రమైన భావాలకు, భావోద్వేగాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ప్రవర్తన, పర్యావరణం లేదా ఇతర కారకాలకు వ్యక్తుల శరీరాలు ప్రతిస్పందించే విధానాన్ని ప్రభావితం చేసే జన్యుపరమైన తేడాలను గుర్తించడానికి మెండెలియన్ రాండమైజేషన్ అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. ఇందులో భాగంగా హ్యాపీనెస్ కోసం డ్రైవింగ్ చేయడం, టెలివిజన్ చూడటం, కంప్యూటర్ ముందు చిల్ అవ్వడం వంటి లీజర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే ధోరణుల మధ్య సహసంబంధాలను వారు అబ్జర్వ్ చేశారు. అంతేకాకుండా యూరోపియన్ వ్యక్తులకుపై జరిపిన గత అధ్యయనాలను పరిశీలించారు. మొత్తం 2,20,000 కంటే ఎక్కువ రికార్డుల ద్వారా అందించబడిన జన్యు శ్రేణులలోని వైవిధ్యాలకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా పరిశోధకులు విశ్రాంతి-ఆధారిత నిశ్చల ప్రవర్తనను, పార్టిసిపెంట్స్ వైద్య చరిత్రకు సంబంధించిన పరిస్థితులను గమనించారు. అయితే విశ్రాంతి కార్యకలాపాల కోసం కంప్యూటర్‌ను ఉపయోగించి గడిపిన ప్రతి 72 నిమిషాల సమయం పెరుగుదల అనేది అంగస్తంభన యొక్క అసమానతలను మూడు రెట్లు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు. రిలాక్స్ అయ్యే పేరుతో ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో నిమగ్నం అయ్యే దీర్ఘకాలిక అలవాటు స్పెర్మ్ ఉత్పత్తిని పెంచే హార్మోన్ వెవల్స్ తగ్గడానికి కూడా కారణం అవుతున్నట్లు గుర్తించారు.