- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యోని ఇన్ఫెక్షన్ లైంగికంగా సంక్రమించే వ్యాధని గుర్తించిన అధ్యయనం.. పురుషులేందుకు చికిత్స పొందాలి?

దిశ, వెబ్‌డెస్క్: యోని ఇన్ఫెక్షన్లు సాధారణంగా బాక్టీరియా, ఫంగల్ (ఈస్ట్) లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇవి యోనిలో అసౌకర్యం, దురద, మంటకు కారణమవుతాయి. యోనిలో బ్యాక్టీరియా సమతుల్యతలో మార్పుల వల్ల వస్తుంది.
అయితే మహిళలు ఇప్పటివరకు ఇది సాధారణ యోని ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు లైంగికంగా సంక్రమించే వ్యాధిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముగ్గురు మహిళల్లో ఒకరిని ప్రభావితం చేసే అలాగే మహిళల సమస్యగా పరిగణించే ఈ వ్యాధి వారి భాగస్వాములను కూడా ప్రభావితం చేస్తుందని ఒక కొత్త ఆస్ట్రేలియన్ అధ్యయనం కనుగొంది. కాగా దాని వ్యాప్తిని నివారించి.. భార్యభర్తలిద్దరికి చికిత్స చేయాలని చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న బాక్టీరియల్ వాజినోసిస్ ఉన్న మహిళలు తాము తరచుగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతామని చెప్పారు. వారానికి ఒకసారి మందులు తీసుకున్న తర్వాత అది మళ్లీ వస్తుందని చెప్పారని పరిశోధకులు వెల్లడించారు. వాజినోసిస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా పురుషులలో, ముఖ్యంగా పురుషాంగ చర్మంలో, మూత్రనాళంలో కూడా ఉంటుందట.
ఇది బహుషా లైంగికంగా సంక్రమిస్తుందని.. అందుకే చికిత్స తర్వాత చాలా మంది మహిళలు ఆ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. స్త్రీలు, పురుష భాగస్వాములు ఇద్దరూ కలిసి చికిత్స చేస్తే సంక్రమణను నయం చేయవచ్చని అంటున్నారు.
ఈ అధ్యయనం 81 జంటలను పరిశీలించింది.భార్యభర్తలిద్దరూ యాంటీబయాటిక్స్ మందులు వాడటం ద్వారా సగం వ్యాధి నయమయిందని ప్రసూతి-గైనకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం సూరి అన్నారు. ప్రస్తుత రోజుల్లో బాక్టీరియల్ వాజినోసిస్ వచ్చిన తర్వాత మహిళలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. కానీ పురుషులు, మహిళలు ఇద్దరికీ చికిత్స అవసరమని అంటున్నారు.
పురుషులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి..?
పురుషులకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, బాక్టీరియల్ వాజినోసిస్ సంబంధిత బ్యాక్టీరియా అనేది వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఒక మహిళా భాగస్వామికి బాక్టీరియల్ వాజినోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, పురుషులు పరీక్షలు చేయించుకుని తప్పక చికిత్స పొందాలని పరిశోధకులు అంటున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.